ETV Bharat / state

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్​

author img

By

Published : May 27, 2020, 10:36 PM IST

ఆపద వచ్చిందంటే చాలు తానున్నానంటూ ఆపన్నహస్తం అందించే కేటీఆర్​ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ వడదెబ్బతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. అంతేకాకుండా పరామర్శ సమయంలో తాను ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్​
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలివేరి దేవయ్య జిల్లాలో హోం గార్డ్​గా విధులు నిర్వహిస్తున్నారు. దేవయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె డిగ్రీ పూర్తి చేయగా , కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. గత నెల 15న కరోనా విధి నిర్వహణలో ఉండగా వడదెబ్బతో చనిపోయాడు.

హోమ్ గార్డ్ దేవయ్య మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తిగతంగా రూ. ఐదు లక్షల చెక్కు అందజేశారు. దేవయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు. అలాగే దేవయ్య కుమార్తె సిలివేరి నవ్యకు అవుట్​సోర్సింగ్​ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మంత్రి తారకరామారావు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వేములవాడ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో సిలివేరి నవ్యకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఈజీఎస్​ మండల కంప్యూటర్ ఆపరేటర్​గా ఉద్యోగం కల్పించారు.

"కష్టకాలంలో తమను ఆదుకున్న కేటీఆర్​కు జీవితాంత రుణపడి ఉంటాం. ఆర్థిక సహకరారంతో పాటు ఉద్యోగం ఇప్పించినందుకు కేటీఆర్​ సారుకు ధన్యవాదాలు."

-సిలివేరి నవ్య, దేవయ్య కుమార్తె

ఇదీ చదవండి: మెదక్‌ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.