వేములవాడలో సిమెంటు ఇటుకల వ్యాపారి నిమ్మశెట్టి రాజుపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. న్యూ అర్బన్ కాలనీకి చెందిన నిమ్మశెట్టి రాజు తమ్ముడు విజయ్ 3వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచాడు. అదే వార్డు నుంచి పోటీ చేసిన సుల్తాన్ శేఖర్‌కు... నిమ్మశెట్టి రాజు అతని తమ్ముడు విజయ్‌తో ఎన్నికల సమయంలో గొడవలు జరిగాయి.
ఇదే క్రమంలో నిన్న రాత్రి రాజుకు, శేఖర్‌కు మాటమాట పెరిగాయి. గొడవ మధ్యలో శేఖర్ రాజుపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి