వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానమైన నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరిపించారు.
ఉత్సవ మూర్తులకు అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చక స్వాములు రమణాచారి, విజయ సింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇంఛార్జ్ నరేందర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్