ఆ యువకుడు ఆర్తనాదాలతో రహదారిపై పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు కొంతమంది అతనిని అడ్డుకుని మంటలు ఆర్పి... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే....
బోయిన్పల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన నక్క నారాయణ అలియాస్ లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్స్టైల్ పార్కులో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఐదేళ్లుగా సిరిసిల్ల పట్టణంలో జీవనం సాగిస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్... గాంధీ చౌక్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి: అక్రమ మద్యం రవాణాదారుల మత్తు వదిలిస్తాం