ETV Bharat / state

శివరాత్రి సందర్భంగా.. వేములవాడకు ఉచిత బస్సు

author img

By

Published : Mar 10, 2021, 12:51 PM IST

Updated : Mar 10, 2021, 1:52 PM IST

మహా శివరాత్రిని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు తరలిరానున్న భక్తుల సౌకర్యార్ధం తిప్పాపురం బస్టాండు నుంచి ఉచిత బస్సును ఏర్పాటు చేశారు.

Free bus to Vemulawada on the occasion of Shivratri from thipparthi busstand
శివరాత్రి సందర్భంగా.. వేములవాడకు ఉచిత బస్సు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరాలయం.. మహా శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. తిప్పాపురం బస్టాండు నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవిలు జెండా ఊపి ప్రారంభించారు. భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు వివరిస్తూ.. భక్తులు అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు

Last Updated : Mar 10, 2021, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.