రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో నాలుగు కోడెలు అనారోగ్యంతో మృతి చెందాయి. గోశాల సిబ్బంది హుటాహుటిన మరణించిన కోడెలను స్థానిక మూలవాగులో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న కోడెలను రాజన్న ఆలయ సిబ్బంది సంరక్షించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: కన్నుల పండువగా అతిరుద్ర యాగం భూమి పూజ