ETV Bharat / state

Fighting On Road: నడి రోడ్డుపై మామాకోడలి పంచాయితీ.. మహిళల సిగపట్లు

నడి రోడ్డుపై ఇరు వర్గాలు నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నారు. మహిళలైతే సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. స్థానికులంతా చోద్యం చూస్తున్నారు. ఏదో ఫిర్యాదుపై విచారణ నిమిత్తం అటుగా వెళ్తున్న పోలీసులకు ఈ దాడి ఎదురైంది. ఏంటా అని వెళ్లి చూస్తే.. వాళ్లు విచారణకు వెళ్లాల్సింది వాళ్లింటికే..! అసలు ఏంటా ఫిర్యాదు.. ఎందుకా దాడి..?

father in law and daughter in law Fighting On Road at ellareddipeta live video

author img

By

Published : Sep 9, 2021, 7:56 PM IST

నడి రోడ్డుపై మామాకోడలి పంచాయితీ.. మహిళల సిగపట్లు

లైంగికంగా వేధిస్తున్నాడని నాలుగు రోజుల క్రితం మామపై కోడలు ఫిర్యాదు చేసింది. అటు నుంచి అటే అమ్మగారింటికి వెళ్లిపోయింది. కట్టుబట్టలతో వెళ్లిన ఆమె.. అత్తగారింట్లో ఉన్న బట్టలు తీసుకొచ్చుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో మామ తరఫు బంధువులు కోడలిపై దాడికి దిగారు. మామపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ భౌతిక దాడికి తెగబడ్డారు. కోడలితో వచ్చిన బంధువులు వారిపై ప్రతిదాడికి దిగారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

నెల రోజుల క్రితం బాధితురాలి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్న తనను మామ ఇబ్బంది పెడుతున్నాడని నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్​స్టేషన్​ నుంచి నేరుగా తన అమ్మ వాళ్లింటికి వెళ్లిపోయింది. తన బట్టలు తీసుకొచ్చుకునేందుకు ఈరోజు అత్తగారింటికి వెళ్లింది. బాధితురాలి రాకను గమనించిన మామ తరఫు బంధువులు.. ఆమెను దూషించారు. పరస్పర దూషణలతో మొదలైన గొడవ.. భౌతిక దాడులకు దారి తీసింది. మహిళల సిగపట్లతో ఘర్షణ పెద్ధదయ్యింది. ప్రధాన రహదారిపైనే గొడవ జరగటం వల్ల.. స్థానికులందరూ మూగి.. చోద్యం చూశారు.

కోడలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కోసమని పోలీసులు కూడా అదే సమయంలో రావటంతో ఈ దాడి వారి కంటపడింది. ఇరువర్గాల వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిగపట్లతో మహిళలు కొట్టుకున్న దృశ్యాలను స్థానికులు తమ చరవాణుల్లో రికార్డు చేయగా.. అవి ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.