ETV Bharat / state

తండ్రి, తనయులను కబళించిన కరోనా మహమ్మారి - కొవిడ్​ దెబ్బకు తండ్రి, కుమారుడు మృతి

కరోనా మహమ్మారి తండ్రి, తనయులను ఒకేరోజు బలితీసుకుంది. కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తండ్రి కన్నుమూశారు. అదే రోజు రాత్రి సిరిసిల్లలో ఆయన కుమారుడు కూడా కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

father and son died with in one day due corona
కరోనా సోకి ఒకేరోజులో తండ్రి, కుమారుడు మృతి
author img

By

Published : May 5, 2021, 5:15 PM IST

కరోనా మహమ్మారికి తండ్రి, కుమారుడు బలైన హృదయవిదారక సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన గుమ్మడి ప్రకాశ్‌ (45), మధురిమ దంపతులకు అభయ్‌, అభిజిత్‌ అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. ప్రకాశ్‌ వేములవాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వీరంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్‌ వచ్చింది. ప్రకాశ్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. మిగతా ముగ్గురు సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో అభిజిత్‌ (18) మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదు: సీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.