రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. తుదిదశకు చేరుకున్న కలెక్టరేట్ భవనం, క్యాంపు కార్యాలయ భవనాల నిర్మాణ పనులను జిల్లా అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, సమావేశ మందిరము, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల నిర్మాణాలను పరిశీలించారు.
నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా.. చర్యలు కఠనంగా ఉంటాయని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్తో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ అంజయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు ఇతర అధికారులు ఉన్నారు. మే నెలాఖరులోగా భవన నిర్మాణం పూర్తి చేసి.. ప్రారంభోత్సవు పూర్తి చేసేలా సిద్ధం చేయాలని, ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఇక ఉచితంగా 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్' పాఠాలు!