రాజన్నసిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ఇద్దరికి లక్షా 26 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపకరిస్తోందని అన్నారు.
లబ్ధిదారులు సకాలంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల బిల్లులు అన్ని సకాలంలో సమర్పిస్తే జాప్యం జరగకుండా సహాయనిధి మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్