రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాబార్డు ఛైర్మెన్ చింతల గోవిందరాజులు పర్యటన ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎంపీ బండి సంజయ్కు పర్యటన సమాచారం ఇవ్వలేదని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా... తోపులాట జరిగింది. పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: దొంగ రిజిస్ట్రేషన్లకు ధరణి స్వర్గధామం: మురళీధర్ రావు