కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగో దశలో గోదావరి జలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్యాకేజీలో సర్జ్‌పూల్(మహాబావి), అన్నపూర్ణ జలాశయం ప్రధానమైంది. 11వ ప్యాకేజీ ద్వారా రంగనాయకసాగర్, కొండపొచమ్మకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజరాజేశ్వర జలాశయంలో నీటిని సర్జ్‌పూల్‌కు తరలించి అక్కడి నుంచి మోటార్ల ద్వారా అన్నపూర్ణ జలాశయాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం రాజరాజేశ్వర జలాశయంలో 11.27 టీఎంసీల నీరుంది. అన్నపూర్ణ జలాశయం పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ఇప్పటికీ జలాశయం నుంచి 4.50 టీఎంసీల నీటిని రంగనాయకసాగర్‌కు తరలించారు. ప్రస్తుతం జలాశయంలో 2.3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో మండు వేసవిలో మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ జలాశయం వరకు విస్తరించిన జల దృశ్యం ఆకట్టుకుంటోంది.
![](https://assets.eenadu.net/article_img/29SR031.jpg)
![](https://assets.eenadu.net/article_img/29SR051.jpg)