ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతి నిర్వహించి ఆయుధ పూజ చేశారు.
స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూలతో ముస్తాబు చేశారు.
ఇదీ చూడండి: విజయదశమి సందర్భంగా మంత్రి గంగుల ప్రత్యేక పూజలు