ETV Bharat / state

'శివరాత్రి'కి సర్వం సిద్ధం - 2 LAKHS OF PEOPLE

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పండుగ సందర్భంగా సుమారు 2కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 2 లక్షల మంది భక్తులు రానున్నారు
author img

By

Published : Mar 1, 2019, 6:18 AM IST

Updated : Mar 1, 2019, 5:10 PM IST

వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిఆలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు.తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి దూస రాజేశ్వర్‌ తెలిపారు.

వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిఆలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు.తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి దూస రాజేశ్వర్‌ తెలిపారు.
Intro:Slug :. TG_NLG_21_28_BOTTELS_LO_CHEKKA_BOMMALU_PKG_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి.మారయ్య, ఈటీవీ , కం, సుర్యాపేట.


( ) అద్భుత కళా నైపుణ్యంతో సీసాల్లో ఒదిగేలా చెక్క బొమ్మలు తయారు చేస్తూ ఆవురా అనిపించుకుంటున్నాడు. తాత చెప్పిన మాటలను సవాల్ గా తీసుకున్న ఓ వడ్రంగి సీసాల్లో చెక్క బొమ్మలను తయారీ చేస్తూ.. శభాస్ అనిపించుకున్నాడు.

వాయిస్ ఓవర్ :
విలువిద్యలు ఎన్ని ఉన్నా కుల విద్యకు సాటి రావు గువ్వల చెన్న అన్న వేమన సూక్తి ని సుర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కూరేళ్ల పోతులూరయచారీ అక్షర సత్యం చేస్తూ తన వృత్తి నైపుణ్యంతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్నాడు. తాతల నాటి కళా వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని తన చేతికి పదును పెట్టాడు. చేతివృత్తుల నైపుణ్యానికి ఆదర్శనంగా నిలిచిన అగ్గిపెట్టెలో చీరను నేసిన కళాకారులున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో గాజు సీసాల్లో చెక్కబొమ్మలను ఒదిగించిన గత వారసత్వాన్ని నిలుపుతున్నాడు. సూర్యాపేట సీతారాంపురం బజారు లో నివాసముంటున్న పోతులూరయ చారీ వడ్రంగి వృత్తి తో జీవనం గడుపుతున్నాడు. మొదట ఎడ్ల బండ్లు తయారు చేసిన అతను వాటి స్థానంలో ట్రాక్టర్లు రావడం తో ప్రస్తుతం ఆయా ఇళ్లల్లో చెక్క పనులకు పరిమితమయ్యాడు. చిన్న చిన్న పనులు చేస్తూ తీరిక సమయాల్లో చెక్క బొమ్మలు తయారు చేస్తున్నారు. వాటిని గాజుసీసాల్లో బంధించి అబ్బురపరుస్తున్నాడు.
వాయిస్ ఓవర్ :
ఆయన చేతి లో తయారైన బొమ్మలు సజీవ శిల్పాలుగా దర్శనమిస్తున్నాయి. ఆయన చేతి నుంచి తయారైన శిల్పాల్లో న్యాయ దేవత , మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ తో పాటు జాతిపిత మహాత్మా గాంధీ , అల్లూరి సీతారామరాజు , చార్మినార్ , తాజ్ మహల్ ఏసుక్రీస్తు , మదర్ తెరిసా , సాయిబాబా , ఎన్టీ రామారావు , కేసీఆర్, జయశంకర్ వంటి బొమ్మలను సీసాలో ఒదిగించాడు. సీసాలో అమర్చిన బొమ్మలు అవి రంగుల సీసాలు కావడంతో బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి.ఒక్కో బొమ్మతయారీకి కనిష్టం గా 15 రోజుల నుంచి 20 రోజులవరకు సమయం పడుతుందని చెపుతున్నాడు. ఎటువంటి ఆదాయం లేకున్నా... కళానైపుణ్యం పై ఉన్న గౌరవంతో క్లిష్టమైన సీసాల్లో చెక్క లను అమర్చుతున్న పోతులూరయ చారీ కళ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది... వైట్

1. కూరేళ్ల పోతులురాయ చారి , సుర్యాపేట.j

ఎండ్ ఓవర్ : ఒక్కో చెక్కముక్కలను సీసాల్లో పేర్చి నౌపుణ్యం తో ఒకరూపంగా మార్చి ప్రతిభను చాటుకుంటున్న పోతులూరయ చారీ కృషి కి గుర్తింపు దక్కాలని కోరుకుందాం.




Body:...


Conclusion:..
Last Updated : Mar 1, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.