ETV Bharat / state

కాసేపట్లో పెళ్లి.. పోలీసుల ఎంట్రీ.. వరుడు అరెస్ట్ - వరుడు అరెస్ట్

పీటల మీద పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా ఇంతలో పోలీసులు వచ్చారు. వరుడుని అరెస్ట్ చేశారు. ఇదేదో సినిమా కాదు పెద్దపల్లి జిల్లాలో జరిగిన రియల్ సీన్. ఇంతకీ వరుడు ఏం చేశాడో తెలుసా..?

wedding stopped in peddapalli groom was arrested
కాసేపట్లో పెళ్లి.. పోలీసుల ఎంట్రీ.. వరుడు అరెస్ట్
author img

By

Published : Mar 21, 2020, 8:01 PM IST

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన వరుణ్ కుమార్​కు సూర్యాపేటకు చెందిన అమ్మాయికి సాయిరాం గార్డెన్స్​లో కొద్ది సమయంలో పెళ్లి జరిగేది. అయితే ఆకస్మికంగా మండపానికి పోలీసులు వచ్చి వరుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న కేసులో అతన్ని అరెస్టు చేశారు.

వరుణ్​కుమార్​ అమెరికాలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. అయితే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్​లో జరిగిన ఓ శుభకార్యంలో ముషీరాబాద్​కు చెందిన ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఏడాది కాలంగా ఇద్దరి మధ్య చాటింగ్​లు, వీడియోకాల్స్ తరచూ మాట్లాడుకున్నారు.

కాసేపట్లో పెళ్లి.. పోలీసుల ఎంట్రీ.. వరుడు అరెస్ట్

తీరా ఒక రోజు మా కుటుంబ సభ్యులు ప్రేమకు ఒప్పుకోవడం లేదని మా కులపు అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారని వరణ్​ చెప్పాడు. ఆ వార్త విన్న ఆ అమ్మాయి తీవ్ర మనోవేదనకు గురై మానసికంగా కుంగిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి ముషీరాబాద్​ పోలీస్​ స్టేషన్లో కేసు పెట్టారు. ముషీరాబాద్​ పోలీసుల సహాయంతో రామగిరి పోలీసులు పెళ్లి మండపానికి వెళ్లి వరణ్​కుమార్​ను అదుపులోకి తీసుకుని మంథని సర్కిల్​ పోలీస్​ స్టేషన్కు తరలించారు. తన కుమార్తెను మోసం చేసిన వరణ్​పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్​ పోలీసులను వేడుకున్నాడు.

ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.