ETV Bharat / state

'అన్నదాతల మోమును చిరునవ్వు కురిపించిన మహనీయుడు కేసీఆర్' - Palabhishekam For CM KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెరాస కార్యకర్తలు మంథనిలో పాలాభిషేకం చేశారు. ఖరీఫ్​ పంటకు సంబంధించిన రైతుబంధు నిధులను ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమచేయటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Trs Party Activists Palabhishekam For CM KCR At Manthani in Peddapalli district
మంథనిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Jun 23, 2020, 5:09 PM IST

​పెద్దపల్లి జిల్లా మంథని అంబేడ్కర్​ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకు గానూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి నిధులు విడుదల చేశార‌ని పేర్కొన్నారు.

రైతును రాజును చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం చాలా గొప్పదని అన్నారు. అన్నదాతల గురించి నిత్యం ఆలోచించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని కార్యకర్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.