తెలంగాణ రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించిన ప్రెస్మీట్పై, రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమకు అనుకూలంగా ఉండే పంటలు పండించడానికి బదులు.. ప్రభుత్వం చెప్పిన పంటలు పండించడం ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయకుంటే.. రైతుబంధు ఆపేస్తామని బెదిరించడం సరికాదన్నారు.
రాష్ట్రంలోని సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు అందిస్తామని, రైతులు వాటిని మాత్రమే తీసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వానికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే.. తద్వారా వచ్చే నష్టానికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. రైతులను టెక్నాలజీ వాడుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష