ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు వదిలేశారు.. ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు

నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి ఆడబిడ్డ పుట్టిందని తెలుసుకొని ఆసుపత్రిలో వదిలి వెళ్లింది. కానీ పురుడు పోసిన వైద్యులు మాత్రం.. పాపను 3 నెలలు కంటికి రెప్పలా సంరక్షించారు. ఐసీడీఎస్​ సెంటర్​కు అప్పగిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఏం జరిగిందంటే..

The parents left that the girl was born .. The hospital staff joined
ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు వదిలేశారు.. ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు
author img

By

Published : Jul 18, 2020, 11:13 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 3 నెలల కిందట ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి వైద్యులు శస్త్ర చికిత్స చేసి కవల పిల్లలకు జన్మనిచ్చారు. అనారోగ్యంతో మగశిశువు మరణించగా.. ఆడ శిశువు కేవలం 920 గ్రాముల బరువు మాత్రమే ఉంది. పాపను బతికించాలనే సంకల్పంతో.. ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యం అందించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు.. శిశువును ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోయారు. వారి కోసం ఆసుపత్రి సిబ్బంది ఆరా తీయగా.. వారికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మళ్లీ మరో పాపను పెంచే శక్తి తమకు లేదని వదిలివెళ్లినట్టు తెలుసుకున్నారు.

ఫలితంగా ఆసుపత్రి సిబ్బంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ సేవచేసి.. 3 నెలల్లో 3 కిలోల బరువు పెరిగే వరకు శిశువును కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఉండడం వల్ల రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఐసీడీఎస్​ అధికారులకు అప్పగించారు. చిన్నారితో ఆడుతూ పాడుతూ గడిపిన హాస్పిటల్ సిబ్బంది.. పసిపాపను అప్పగిస్తుంటే సొంత వారిని దూరం చేసుకున్నట్లు బరువెక్కిన హృదయాలతో కంటతడి పెట్టుకున్నారు.

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు వదిలేశారు.. ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు

ఇదీచూడండి: నాయినా..! నాకు ఊపిరాడటం లేదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.