పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం మియావకి విధానంలో చిట్టడవులను అభివృద్ధి చేస్తోంది. ఈ విధానంలో రెండు మీటర్ల వెడల్పుతో 0.6 మీటర్ల లోతులో ట్రంచ్లు ఏర్పాటు చేస్తారు. అందులో రంపపు పొట్టు, ఆవు పంచకం, కొబ్బరి పీచు, ఇసుక, మట్టి చేర్చి నేలను సిద్ధం చేస్తారు. ఒకటిన్నర అడుగుకు ఒక మొక్క చొప్పున నాటుతారు.
8 అడుగుల ఎత్తు వరకు పెరిగాయి
మొదటిసారిగా జనవరి 23న చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. సహజ ఎరువులు ఉపయోగించి రూ.30 లక్షల నిధులతో 52 రకాల మొక్కలను నాటారు. రామగుండం ఎన్టీపీసీ కాజిపల్లి సమీపంలోని మూడున్నర ఎకరాల ఖాళీ స్థలంలో చిట్టడవి ఏర్పాటు చేశారు. 3,350 మొక్కలు నాటగా అందులో కొన్ని మొక్కలు దాదాపు 8 అడుగుల ఎత్తు వరకు పెరిగాయి. ఈ మొక్కల్లో శీతాఫలం, సపోటా, దానిమ్మ, మామిడి, జామ, ఉసిరి ఉన్నాయి.
హరితహారంలో మరో మూడు వేల మొక్కలు
ప్రస్తుతం ఉన్న మియావకి చిట్టడవి అనుకొని మరో రెండు ఎకరాల్లో మొక్కల పెంపకానికి ఎన్టీపీసీ యాజమాన్యం మరో ప్రణాళిక సిద్ధం చేస్తుందని అధికారులు తెలిపారు. రానున్న హరితహారంలో మరో మూడు వేల మొక్కలు నాటాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త