పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులకు ధైర్యం చెప్పారు. అడవి శ్రీరాంపూర్, ఓడెడ్ గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి ఇతర పంటలను పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ వారితో జాయింట్ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులకు, అదే విధంగా నేలమట్టమైన నివాస గృహాలకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానేరు వాగు ఉద్ధృతందా ప్రవహిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు