పాముకు చెలగాటం కప్పకు ప్రాణ సంకటం అనే నానుడి పక్షులకు ఎదురైంది. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లిలో చెరువు పక్కనున్న చెట్టుపై పక్షులు ఏర్పాటు చేసుకున్న గూళ్లపై పాము కన్నేసింది. అందులోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.
అది చూసి ఆ పక్షులు భయభ్రాంతులకు గురయ్యాయి. గూళ్లలోకి చేరేందుకు ఎంత శ్రమించినా సాధ్యంకాక పోవటం వల్ల ఆ సర్పం నిరాశగా వెనుదిరిగింది. తమ గూడు చుట్టూ పాము తిరూగుతున్నంతసేపు పక్షులు విలవిలలాడాయి.