గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ శ్రీ దేవసేన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నారు.
ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై