ఆసరా పింఛన్ల మంజూరీలో ఆన్లైన్లో దొర్లిన తప్పిదాలను నిరసిస్తూ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ముగ్గురు లబ్ధిదారులు ఇటీవల ఆసరా పింఛను కోసం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురు లబ్ధిదారుల పేర్లు రాజుయే కావడం వల్ల అధికారులు ఇంటి పేరుతో సంబంధం లేకుండా ఒకరి దరఖాస్తులు మరొకరికి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గత ఐదు నెలలుగా వారికి పింఛను రావడం లేదు. తప్పిదాలను వెంటనే సవరించి తమకు పింఛన్లు మంజూరు చేయాలని పెద్దపెల్లి జిల్లా డీఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: రుతుపవనాలు 5 రోజులు ఆలస్యం: ఐఎండీ