దీర్ఘకాలిక రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా ఆలన వాహనం ఉపయోగపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన ఆలన వాహనాన్ని జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక చికిత్స అందించేందుకు ఆలన వాహనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గోదావరిఖని పట్టణ ప్రాంతంలోని రోగులకు ఈ వాహనం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ అన్నారు. క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, పక్షపాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఆలన కార్యక్రమం తీసుకువచ్చిందని వివరించారు. ఈ వాహనంలో వైద్యుడు, స్టాఫ్ నర్సు అందుబాటులో ఉంటారని... ఆశా కార్యకర్తల సహకారంతో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ