పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని అర్జీ-1,2,3 బొగ్గు గనుల్లో జాతీయ కార్మిక సంఘాల సమ్మె పాక్షికంగా కొనసాగింది. మొదటి షిఫ్ట్‌కి వెళ్లాల్సిన కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో అన్ని కార్మిక సంఘాలు కార్మిక నేతలు బొగ్గు గనులపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బొగ్గు గనులు ప్రైవేటు పరం
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికే 200 బొగ్గు గనులు కార్పొరేట్లకు కట్టబెట్టారని.. రానున్న రోజుల్లో మరిన్ని ప్రైవేటు పరం చేయాలని సర్కారు చూస్తుందన్నారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?