రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రైల్వేస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రైల్వే రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోందని వామపక్షాల నేతలు ఆరోపించారు.
109 రైళ్లను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. రైళ్లను ప్రైవేటుపరం చేస్తే ఇప్పటివరకు ఉన్న రైల్వే ఛార్జీలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగే అవకాశముందని తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.