ETV Bharat / state

ఓపెన్​కాస్ట్​ గని పూడ్చివేతకు కొత్త విధానం

ఓపెన్​కాస్ట్​ గని పూడ్చివేతకు కొత్త విధానం అమలు చేస్తామని ఎన్టీపీసీ స్పష్టం చేసింది. 800 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యంతో 2 ప్లాంట్లను రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తోంది.

New policy for Open cast mine burying in ramagundam
ఓపెన్​కాస్ట్​ గని పూడ్చివేతకు కొత్త విధానం
author img

By

Published : Jul 2, 2020, 9:22 AM IST

రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న కొత్త విద్యుత్​కేంద్రం నుంచి వెలువడే బూడిదతో ఓపెన్​కాస్ట్​ బొగ్గు గనిని నింపేందుకు కొత్త విధానం అమలు చేస్తామని ఎన్టీపీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 800 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యంతో 2 ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మిస్తోంది.

ఈ కేంద్రం నుంచి అధికస్థాయి బూడిద వినియోగం (హెచ్​సీఎస్​డీ) విధానంలో గొట్టాల ద్వారా నేరుగా మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ బొగ్గు గనిలోకి బూడిదను పంపుతారు. ఇందుకోసం మల్కాపూర్​లో గొట్టపుమార్గం నిర్మించినట్లు తెలిపింది. సాధారణ పద్ధతిలో బూడిదను తరలించేందుకు ఉపయోగించే నీటిలో 20శాతమే వినియోగించడం హెచ్​సీఎస్​డీ విధానమని ఎన్టీపీసీ తెలిపింది.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.