కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. పెద్దపెల్లి జిల్లా మంథని ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించి.. బాధితులకు అందిస్తోన్న వైద్య సేవల గురించి అధికారులతో చర్చించారు.
కేంద్రంలోని గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని.. సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే. క్వారంటైన్లో ఉన్న వారికి మూడు పూటలు పౌష్టికాహారాన్న అందిస్తున్నట్లు వివరించారు. కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా పరీక్షల కోసం బారులు తీరిన జనాలు