రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసినధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంతో పాటు లోకపేట్, ముప్పిడి తోట, రాములపల్లె, ధూళికట్ట గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతులు పంటను అమ్మకానికి తీసుకు వచ్చిన సమయంలో ధాన్యంలో తేమ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బయట మార్కెట్లలో దళారులను ఆశ్రయిస్తే మద్దతు ధర కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సన్నరకం వరి ధాన్యానికి రూ.1888 మద్దతు ధర కేటాయించినట్లు పేర్కొన్నారు.