ETV Bharat / state

తాగునీటి కష్టాలు తీర్చేందుకే భగీరథ పథకం: ఎమ్మెల్యే చందర్​ - రామగుండంలో జరుగుతున్న మిషన్​ భగీరథ వాటర్​ ట్యాంక్​ పనులు

తాగునీటి కష్టాలను తొలగించడమే మిషన్ భగీరథ పథకం ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో జరుగుతున్న మిషన్​ భగీరథ వాటర్​ ట్యాంక్​ పనులను పరిశీలించారు.

mission bhageeratha water tank construction works visited by mla chandar at ramagundam in peddapalli district
మహిళల తాగునీటి కష్టాలు తీర్చేందుకే భగీరథ పథకం: ఎమ్మెల్యే చందర్​
author img

By

Published : Sep 2, 2020, 9:20 AM IST

రాష్ట్రంలో మంచినీటి కష్టాలను తొలగించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. దానికై మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా అమలు చేశారని ఆయన వెల్లడించారు.

పెద్దపెల్లి జిల్లా రామగుండం పట్టణంలోని సీఎస్పీ కాలనీలో జరుగుతున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధిచేసిన తాగునీరు అందించడమే మిషన్ భగీరథ పథకం లక్ష్యమన్నారు.

mission bhageeratha water tank construction works visited by mla chandar at ramagundam in peddapalli district
మహిళల తాగునీటి కష్టాలు తీర్చేందుకే భగీరథ పథకం: ఎమ్మెల్యే చందర్​
mission bhageeratha water tank construction works visited by mla chandar at ramagundam in peddapalli district
మహిళల తాగునీటి కష్టాలు తీర్చేందుకే భగీరథ పథకం: ఎమ్మెల్యే చందర్​

రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో 40వేల ఇళ్లకు సురక్షితమైన గోదావరినీరు అందిస్తామని.. 24గంటలు తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో వేసవికాలంలో ఆడపడుచులు తాగునీరు కోసం బిందెలతో ట్యాంకులు, బోర్ల వద్ద ఇబ్బందులు పడుతుండేవారని.. ఇకపై ఆ సమస్య రాష్ట్రంలోని మహిళలకు రాకూడదనే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రూ. 90 కోట్లతో 13 ట్యాంకులు నిర్మించినట్టు తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో రూ. 9 కోట్లతో లింకేజ్ పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నగర కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.