ETV Bharat / state

'డిసెంబర్​ 15 నాటికి రామగుండం ఎరువుల కర్మాగారం' - minister sadananda goud visited ramagundam fertilizer plant

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ్​ సందర్శించారు. డిసెంబర్ 15 నాటికి పూర్తిస్థాయి నిర్మాణం పూర్తవుతుందని.. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయమై ఇప్పటికే చర్చించామని తెలిపారు.

'డిసెంబర్​ 15 నాటికి రామగుండం ఎరువుల కర్మాగారం'
author img

By

Published : Sep 26, 2019, 9:47 PM IST

'డిసెంబర్​ 15 నాటికి రామగుండం ఎరువుల కర్మాగారం'

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ్​ సందర్శించారు. ఆర్​ఎఫ్​సీఎల్ అధికారులతో సమీక్షించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణ పనులు కొంత ఆలస్యమవుతున్నాయన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. డిసెంబర్ 15 నాటికి పూర్తిస్థాయి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తర్వాత ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ​​ స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇప్పటికే చర్చించామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

మంత్రికి నిరసన సెగ

మంత్రి పర్యటన సందర్భంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్​, ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ వెంకటేష్​తో మంత్రి చర్చించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కృషి: కేటీఆర్

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.