పెద్దపల్లి జిల్లా మంథనిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ముత్తారం మండలంలోని పారుపల్లి, కేశనపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేశనపల్లిలోని తెలంగాణ చౌరస్తాలో గులాబీ జెండా ఎగరవేసి, నూతనంగా నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్నిఆవిష్కరించారు.
అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్డైసన్- 2020 పురస్కారం