పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో మార్చి 24 నుంచి నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాలను విడుదల చేస్తామని రామగుండం ఏసీపీ రామ్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరిఖని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సీజ్ చేసిన వాహనాలను మోటర్ వాహన చట్టం 179 ప్రకారం యజమానులకు ఈ చలాన్ ద్వారా 500 రూపాయల జరిమానా విధించి వాహనాలు అప్పగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌ను జత పరిచి పోలీసులు వద్దకు వచ్చిన వాహన యజమానులకు వాహనాలు ఇచ్చి పంపిస్తున్నట్లు వివరించారు. 40 రోజుల తర్వాత వాహనాలను విడుదల చేయడం వల్ల ఉదయం ఎనిమిది గంటల నుంచే రామగుండం కమిషనర్ కార్యాలయం గేటు వద్ద నుంచి కిలోమీటర్ల మేర వాహనదారులు నిలబడి ఉన్నారు. వాహనాలు తీసుకునే సమయంలో వాహనదారులు భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులను కూడా ధరించారని ఏసీపీ రామ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?