పెద్దపల్లి జిల్లాలోని మంథని అనేక దేవాలయాలకు కొలువై ఉన్నది. శనివారం, సంకట చతుర్థి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు చేరుకొని విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించేవారు. నేడు సంకట చతుర్థి సందర్భంగా శ్రీ మహా గణాధిపతి దేవాలయంలో స్వామివారికి ఉదయమే పసుపు, కుంకుమ, గంధం, వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం అర్చకులు దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంథనిలో కూడా అధిక సంఖ్యలో కరోనా ఉద్ధృతి ఉండటంతో భక్తులు దేవాలయాలకు వెళ్లలేకపోయారు. అతి తక్కువ మందే దేవాలయానికి వచ్చి పూజల అనంతరం ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పూజలు నిర్వహించారు. లాక్డౌన్తో దేవాలయానికి భక్తులు రాకపోవడంతో హుండీ ఆదాయం తగ్గి అర్చకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: KTR : పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం