పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఏఆర్‌బీ ఇటుక బట్టీలో పనిచేసే సురాన్ అనే కూలీ ఒంట్లో బాగాలేక పోవడం వల్ల ఈరోజు పనికి వెళ్లలేదు. ఆగ్రహానికి గురైన యజమాని అవినాష్ సురాన్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సొమ్మసిల్లి కిందపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. బట్టీ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూలీలంతా పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అవినాష్ తమపైన దాడికి పాల్పడడం ఇది మొదటి సారి కాదని ఇప్పటికే అతని చేతిలో ఇద్దరు కూలీలు మృతిచెందారని ఆరోపించారు. తాము ఒడిశా నుంచి ఇక్కడకు చావడానికి రాలేదని.. పొట్టకూటికోసం పనిచేసుకోవడానికి వచ్చామన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఐపీఎల్ తొలి సీజన్లో ధోని ధరెంతంటే..?