పెద్దపల్లి జిల్లా మంథనిలో కార్తిక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలారు. గోదావరి ఒడ్డునున్న గౌతమేశ్వర ఆలయంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో ప్రతి రోజు పవిత్రమైనదేనని.. అందుకే ఈ మాసంలో వ్రతాలు, పూజలు, దైవారాధనకు ప్రాధాన్యమిస్తారు భక్తులు.
ఇదీ చదవండిః కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు