పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం కోమండ్లపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా పోశాలు అనే వ్యక్తి తన మొదటి భార్యను హత్య చేశాడు. స్వరూపకు పోశాలుతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కావటం లేదనే కారణంతో పోశాలు రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతోనూ పెళ్లి బంధం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి స్వరూప ఉండే ఊరికి వస్తూ పోతూ ఉండేవాడు. భార్యతో తరచుగా గొడవపెట్టుకునే వాడని ఇరుగు పొరుగు చెప్తున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ పెరగటం వల్ల స్వరూప తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన స్వరూప అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!