ETV Bharat / state

SOLAR: ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ ఉత్పత్తికి సిద్ధం..

థర్మల్‌ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సంప్రదాయ ఇంధన వనరులతో విద్యుదుత్పత్తిపై ఎన్టీపీసీ దృష్టి సారించింది. ఎలాంటి వాతావరణ కాలుష్యం, భూసేకరణ సమస్యలు లేకుండా ఉండే విధంగా నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతోంది. రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్లాంట్​ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

SOLAR: వేగంగా జరుగుతున్న ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ పనులు

author img

By

Published : Jul 14, 2021, 10:25 AM IST

Updated : Jul 14, 2021, 10:55 AM IST

పెద్దపెల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బొగ్గు ఆధారిత థర్మల్​ విద్యుత్ ఉత్పత్తి 2600 మెగావాట్లు జరుగుతుండగా.. తాజాగా 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు యూనిట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కాలుష్యంతో పాటు భూసేకరణ ఇబ్బందులుగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు యాజమాన్యం ఆలోచించి నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్​పై దృష్టి సారించింది. అందులో భాగంగానే దేశంలోనే అతిపెద్దదైన 100మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​లో 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులను చేపట్టింది. లాక్​డౌన్​ కారణంగా ఈ పనుల్లో కొంత జాప్యం జరిగింది. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్​కు త్వరలోనే అనుసంధానం చేయనున్నారు. దశలవారీగా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

పనులు వేగంగా జరుగుతున్నాయి..

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. లాక్​డౌన్​ కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో 15మెగా వాట్ల విద్యుత్​ ఉత్పత్తిని త్వరలోని ప్రారంభించనున్నాం. తెలంగాణలో ఇలాంటి ప్లాంట్లు నిర్మించేందుకు అనేక ఇతర రిజర్వాయర్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. -సునీల్​కుమార్​, సీజీఎం, ఎన్టీపీసీ రామగుండం

ఇదీ చదవండి: Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం

Last Updated : Jul 14, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.