పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ వినాయక చవితికి మట్టి ప్రతిమలను పూజించాలని ఎన్టీపీసీ ఈడీ పీపీ కులకర్ణి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులకు గణపతి ప్రతిమలను అందజేశారు. మట్టి వినాయకులనే పూజించండి అని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులతో పాటు ఉద్యోగులు, బీపీ మహిళా సమితి ప్రతినిధులు, రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"