యువత ఎవరూ కూడా చెడు మార్గం వైపు వెళ్లకూడదని పెద్దపల్లి డీసీపీ రవీందర్ అన్నారు. జిల్లాలోని మంథని మండలం మల్లారంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ మహేందర్ పాల్గొన్నారు. తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో మల్లారంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
అనుమానితులు ఎవరైనా... గ్రామాల్లోకి వస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.