పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లిలోని గంగా గుడిలో భీష్మ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భీష్ముడిని స్మరించుకునేందుకు మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా నిర్వహిస్తున్నట్లు... అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో గంగపుత్రులకు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను, కుల హక్కుల దోపిడీలను అరికట్టాలని భీష్ముడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రతి ఒక్క మత్స్యకారుడు భీష్ముడిని స్మరించుకోవాలన్నారు. గంగపుత్రుల పట్ల ప్రభుత్వాల చిన్న చూపును రూపుమాపాలని కుల ఆరాధ్యుడు భీష్ముడికి వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దానిలోని అంశాలు...
1. గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
2. వెంటనే ఉప్పల్ బాగాయత్లో గంగపుత్ర భవన్కు శంకుస్థాపన చేయాలి.
3. గంగమ్మ తెప్పోత్సవం రాష్ట్ర పండుగగా ప్రకటించి... నిధులు మంజూరు చేయాలి.
4. జీఓ 6 ను రద్దు చేయాలి.
5. రాష్ట్రంలో మత్స్య యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
6. గంగపుత్రులు చేపలు పట్టే చోట వారికి పూర్తి హక్కులు ఉండాలి. ఇతర కులాల వారికి సభ్యత్వం ఇవ్వకూడదు.
7. ఎవరైనా చెరువులపై దోపిడీకి యత్నిస్తే వారిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక చట్టం తేవాలి.
8. సంప్రదాయ మత్స్యకారులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు కల్పించాలి.
9. జీఓ 15 ను గెజిట్ నుంచి తొలగించి, జీఓ 74 ను పునరుద్ధరించాలి.
ఇదీ చదవండి: బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష