పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామం వద్ద మంథని నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వాహనంపై రాయి విసరడంతో బస్సు అద్దం పగిలి, డ్రైవర్ చేతికి గాయం అయ్యింది. వెంటనే ప్రయాణికులను మరొక బస్సులో తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!