ETV Bharat / state

మారని పసుపు రైతుల బతుకు - market

ఏ పంట వేసినా రైతుకు నష్టమే మిగులుతుంది. ప్రకృతి వైపరీత్యం ఓ వైపు... మద్దతు ధర లేక మరోవైపు అన్నదాత ఉక్కిబిక్కిరి అవుతున్నారు. తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లినా  నిజామాబాద్​ పసుపు రైతుల బాధ తీరలేదు. సీజన్ ముగింపు దశకు వచ్చినా ధరల క్షీణత భయపెడుతూనే ఉంది. నమూనా ధర పేరుతో దళారులు అన్నదాతను నిలువుదోపిడీ చేస్తునారు. ప్రస్తుతం క్వింటాకు రూ. 6500 ఉండండం వల్ల కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పసుపు బస్తాలపై రైతు
author img

By

Published : May 17, 2019, 8:10 PM IST

Updated : May 17, 2019, 11:04 PM IST

మారని పసుపు రైతులు బతుకు

నిజామాబాద్ మార్కెట్​లో పసుపు రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటా పచ్చ బంగారానికి ఐదు వేలు పలికింది. సీజన్ ముగింపులో ధర పెరుగుతుందని ఆశతో కొందరు రైతులు పసుపు నిల్వచేసుకుని మార్కెట్ యార్డుకు తీసుకురాగా రూ. 1500 మాత్రమే పెరిగింది. కనీసం రూ. 10 వేలు పలుకుతుందనుకున్న అన్నదాత ఆశలు అవిరయ్యాయి.

ఎకరాకు లక్ష

పచ్చ బంగారం రోజురోజుకు కాంతిహీనం అవుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సంవత్సరానికి ఎకరా పసుపు సాగుకు లక్ష ఖర్చు అవుతుంది. అన్ని భరించి మార్కెట్​కు వెళ్తే అక్కడి వర్తకులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. నాణ్యత లేదంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు.

ఏపీ నుంచి

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పసుపు పంట తరలి వస్తోంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల రైతులు పచ్చ బంగారం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అక్కడి వ్యవసాయ మార్కెట్​లో పసుపు క్విటాకు రూ. 4 వేలు పలకడం వల్ల వెయ్యి మిగులుతాయని ఇంత దూరం వచ్చామని అన్నదాతలు తెలిపారు. వచ్చే పంటకైనా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : May 17, 2019, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.