పసుపు రైతుల అభివృద్ధికి, గిట్టుబాట ధర కల్పించడానికి భాజపా ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు రైతులతో సమావేశమైన ఆయన...శాఖా పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని.. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. బోర్డు విషయంలో లోతైన చర్చ జరుగుతోందన్నారు. పసుపుకు గిట్టుబాటు ధర, బోర్డు ఏర్పాటుకు కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు వచ్చి సమాచారం సేకరించి నివేదిక అందించారని చెప్పారు.
ఇదీ చూడండి: తండాలు గ్రామాలైనా... తప్పని తిప్పలు