ETV Bharat / state

'రైతులకు సన్నరకాల వరి విత్తనాల కొరత లేదు' - telangana varthalu

రైతులకు విత్తనాల విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్​పల్లి, ఏ.కోడూరు గ్రామాల ప్రాథమిక సహకార సంఘాల గోదాములను ఆయన తనిఖీ చేశారు.

'రైతులకు సన్నరకాల వరి విత్తనాల కొరత లేదు'

author img

By

Published : Jun 16, 2021, 6:48 PM IST

రైతులకు సన్నరకాల వరి విత్తనాల కొరత లేదని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్​పల్లి, ఏ.కోడూరు గ్రామాల ప్రాథమిక సహకార సంఘాల గోదాములను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి విత్తనాల విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్​కు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.

వానాకాలం వరిలో సన్న రకాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్​ పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వరి సాగు అవుతుందని... అందులో సన్నరకానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తద్వారా మార్కెట్లో ఆ ధాన్యానికి డిమాండ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి: Police Stations: కార్పొరేట్ కార్యాలయం కాదు పోలీస్ స్టేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.