నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో పోస్ట్ ఆఫీస్ శాఖల పోస్ట్ మాస్టర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తపాలశాఖ ప్రవేశపెట్టిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, జీవిత బీమా మరియు సుకన్య సమృద్ధి వంటి పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ ఉమా మహేశ్వర్ వివరించారు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ప్రజలు అనేక లాభాలు పొందుతారని... ఇంటి నుంచే అన్ని రకాల చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు.
ఇదీ చదవండిః క్యాంప్ రాజకీయాలు షురూ