నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. విజయ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం వివాహం ఉండగా... పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. సోమవారం ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. పూజగదిలోకి గ్యాస్ వ్యాపించి మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు గమనించి మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్ పేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు నాణ్యతలేని సిలిండర్లను పంపిణీ చేస్తూ... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం