నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రనగర్లో ఒకేరోజు నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మే నెల 14న సరోజిని తమ్ముడు సుందర్.. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అదే రోజు సుందర్ భార్య సౌమ్య ఫోన్ రీఛార్జ్ చేసుకుంటానని చెప్పి.. సరోజిని కూతురు సుకన్యను తీసుకెళ్లింది. ఇలాగే సౌమ్య కుమారుడు కార్తిక్.. అతని స్నేహితుడు అంకమ్మరావులు కూడా కనపడకుండా పోయారు. ఈ నలుగురు జోజీపేట నుంచి వెళ్లి 15 రోజులు అవుతున్నా ఆచూకీ లేదని సరోజిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో బీర్లకు కరువొచ్చింది..