నిజామాబాద్ జిల్లా నంది చౌక్ మండల కేంద్రంలో తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తల్వేద ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేవంటూ వాపోయారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు, రాజకీయనాయకులకు విన్నవించినా ఫలితంలేకపోవడం వల్లనే రోడ్డెక్కినట్లు తెలిపారు. కనీసం కుల సంఘాల నిధులివ్వడంలో చూపిన ప్రాధాన్యత కూడా పాఠశాలలను బాగుచేయడంలో చూపకపోవడం బాధకరమన్నారు. పేదవారిగా తమ పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు... అలాంటి దాని విషయంలో రాజీపడబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ!