ETV Bharat / state

Telangana University Registrar Yadagiri : టీయూ రిజిస్ట్రార్​గా యాదగిరి.. వివాదం ముగిసినట్లేనా..! - టీయూలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

TU registrar Yadagiri : అనేక వివాదాల అనంతరం తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్​గా ఆచార్య యాదగిరి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా.. యాదగిరిని రిజిస్ట్రార్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన ఆరు నెలలు పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు యూనివర్శిటీలో ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Telangana University Registrar Yadagiri
Telangana University Registrar Yadagiri
author img

By

Published : Jun 16, 2023, 5:24 PM IST

Telangana University latest news : వర్శిటీ పదవుల విషయంలో గత కొంత కాలంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో నడుస్తున్న వివాదం ఇవాళ్టీతో చల్లారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు వీసీ రవీందర్ గుప్తా.. యూనివర్శిటీ రిజిస్ట్రార్​గా ఆచార్య యాదాగిరిని నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో ఆరు నెలలు టీయూ రిజిస్ట్రార్​గా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. అనంతరం నిజామాబాద్ నుంచి హైదరాబాద్​కు వీసీ పయనమయ్యారు. దీంతో మరోసారి విశ్వవిద్యాలయంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

Outsourcing employees strike at TU : తెలంగాణ వర్శిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనలు 5వ రోజుకు చేరాయి. జీతాల కోసం పరిపాలన భవనం ఎదుట పోరుగు సేవల ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిరసన ప్రభావంతో వసతి గృహలలో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. వీసీ, ఈసీ సమన్వయంతో వ్యవహరించి తమకు జీతాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్శిటీలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. జీతాలు వచ్చే వరకు నిరసనలు విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆకాలి బాధ చూడలేక ఇవాళ్టీ నుంచి వంట చేసిన అనంతరం సిబ్బంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని సిబ్బంది ప్రకటించారు.

Telangana University VC and Registrar controversy : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ఉన్న తెలంగాణ యూనివర్శిటీకి వివాదాలు కొత్తకాదు. కొన్ని నెలలుగా రిజిస్ట్రార్‌ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు మరింత దిగజారుతోంది. వీసీగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు తీసుకుని రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే.. ఇప్పటికే తొమ్మిది సార్లు రిజిస్ట్రార్‌లు మారారంటే వర్శిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

రిజిస్ట్రార్‌ మొదలు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల వరకూ ప్రతి అంశం వివాదాలకు కేరాఫ్ అడ్రాస్​గా నిలుస్తోంది. రిజిస్ట్రార్‌ను టీయూ పాలక వర్గం నియమిస్తే.. వైస్‌ ఛాన్స్‌లర్‌ వ్యతిరేకించడం.. వీసీ నియమిస్తే ఈసీ ఆమోదం లభించకపోవడం వంటి ఘటనలతో కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, బీవీఎం, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కూడా చేశారు.

వీసీని వెంటనే రాజీనామా చేయాలని వీసీ ఛాంబర్​లో బైఠాయించారు. అనేక అవాంతరాల నడుమ ఎట్టకేలకు ప్రభుత్వ సూచనల మేరకు ఇవాళ రిజిస్ట్రార్​గా యాదగిరిని నియమిస్తూ వీసీ ఉత్వర్వులు జారీ చేశారు. ఇక నుంచి అయినా యూనివర్శిటీలో వివాదాలకు స్వస్తి పలికి మంచి విద్యాను అందిచడానికి అధికారులు ముందుకు వస్తారా..! అనేది వేసి చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.